సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో కోలాబోరేషన్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ‘గుంటూరు కారం’. పుష్కర కాలం తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే బజ్ క్రియేట్ చేసింది. మహేష్ ఫస్ట్ లుక్ అండ్ గుంటూరు కారం గ్లిమ్ప్స్ తో హిట్ బొమ్మ అనిపించాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలతో హిట్ మిస్ అయ్యింది కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ఇండస్ట్రీ హిట్ కొడతాం అని గ్లిమ్ప్స్ తోనే చెప్పిన హీరో-డైరెక్టర్ కాంబినేషన్, గుంటూరు కారం షూటింగ్ ని మాత్రం పాజ్ అండ్ ప్లే మోడ్ లో చేస్తున్నారు. లేటెస్ట్ గా మహేష్ బాబు మూడు వారాల ఫ్యామిలీ ట్రిప్ వెళ్లడంతో గుంటూరు కారం షూటింగ్ కి బ్రేక్ పడింది. మహేష్ తన పుట్టిన రోజుని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోని ఆగస్టు 16న తిరిగి రానున్నాడు, 20 నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాడని సమాచారం.
త్రివిక్రమ్ మహేష్ బాబు వచ్చే వరకూ వెయిట్ చేయకుండా ఆగస్టు 11 లేదా 12 నుంచే షూటింగ్ మొదలుపెట్టి ఇతర ఆర్టిస్టులతో షూటింగ్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడట. మహేష్ 20 నుంచి జాయిన్ అయితే అక్కడి నుంచి బ్రేక్ లేకుండా గుంటూరు కారం షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. పాజ్ అండ్ ప్లే మోడ్ లో జరుగుతున్న గుంటూరు కారం షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మిలియన్ డాలర్ క్వేషన్ లా ఉంది. ఇప్పటికే జనవరి 13న గుంటూరు కారం సినిమాని రిలీజ్ చెయ్యాలని అనౌన్స్ చేసినా, ఆ డేట్ మిస్ అయ్యేలా ఉంది. సంక్రాంతి సీజన్ నుంచి గుంటూరు కారం సినిమా సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది.