Guntur Kaaram : మూవీ ఆడియో రైట్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ ఆడియో కంపెనీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాలో శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి మహేష్ బాబు సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారు..ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.ఈ సినిమా పై ఇప్పటికే భారీగా అంచానాలు వున్నాయి.అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేదా అని అనుమానాలు వచ్చాయి. కానీ వాటికీ మేకర్స్ చెక్ పెట్టారు.షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.
ఇక ఈ సినిమా విడుదలకు చాలా సమయం ఉన్న అప్పుడే బిజినెస్ భారీగా చేస్తున్నట్టు సమాచారం… ఎప్పటి నుండో ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతుందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తూనే ఉన్నాయి.అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాకపోయినా ఈ సినిమా కోసం కూడా ఏకంగా 220 కోట్ల బడ్జెట్ పెట్టనున్నట్లు సమాచారం… అయితే ఈ బడ్జెట్ కు అనుగుణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది.. మహేష్, త్రివిక్రమ్ కు వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా బిజినెస్ స్థాయి కూడా పెరిగింది. తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు ప్రముఖ మ్యూజికల్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్టు సమాచారం..త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కూడా మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా గ్లింప్స్ వీడియో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో మహేష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీ కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!