Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తన 48 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక గుంటూరు కారం నుంచి మహేష్ బర్త్ డే ట్రీట్ గా ఫ్యాన్స్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తారు అని అనుకున్నారు. కానీ, మేకర్స్ కొన్ని కారణాల వలన అవేమి కుదరలేదు. అయినా ఫ్యాన్స్ ను నిరాశపర్చకుండా మేకర్స్ వరుసగా మహేష్ పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ కొద్దిగా ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పటికే అర్ధరాత్రి 12 గంటలకు మహేష్ పోస్టర్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. లుంగీ కట్టుకొని మహేష్ మాస్ లుక్ లో సిగరెట్ తాగుతూ కనిపించాడు.
Allu Arha: అర్హ పాప.. స్కూల్ కు వెళ్లే టైమ్ వచ్చింది
ఇక ఇప్పుడు మరో పోస్టర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచారు. మహేష్ – కబడ్డీ డెడ్లీ కాంబో అన్న విషయం అందరికి తెల్సిందే. ఈ సినిమాలో ఈ డెడ్లీ కాంబో సీన్స్ ఓ రేంజ్ లో ఉండనున్నాయట. విలన్స్ తో మహేష్ ఆడే కబడ్డీ ఆట సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుంది అని తెలుస్తోంది. ఇక తాజాగా కబడ్డీ సీన్ లో నుంచి ఒక ఊర మాస్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాబు స్వాగ్ , స్టైల్ మాములుగా లేవు అంటే అతిశయోక్తి కాదు. రెడ్ కలర్ షర్ట్.. బ్లాక్ కలర్ బనియన్.. గాగుల్స్ .. తలకు యెర్ర కండువా కట్టుకొని రంగంలోకి దిగుతున్న సింహంలా కనిపించాడు. ఇక మహేష్ కబడ్డీ కూత పెడితే.. థియేటర్ లో మోత మోగాల్సిందే.. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా అనుకున్న విధంగా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.