Dhurandhar Movie: ‘ధురంధర్’ (Dhurandhar) సినిమాలో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. భారతదేశంలో ఈ సినిమా ఆకట్టుకుంటుండగా.. ఆ ఆరు దేశాల్లో మాత్రం దీనిపై నిషేధం విధించినట్లు తెలుస్తుంది. ఆరు గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ సినిమాను బ్యాన్ చేసినట్లు సమాచారం.
Read Also: Hyderabad: అనుమతిలేని లిక్కర్ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. పోలీసుల ఎంట్రీతో..
అయితే, ‘ధురంధర్’ సినిమాను బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు యూఏఈలు నిషేధించినట్లు బాలీవుడ్ మీడియా తెలియజేసింది. బాలీవుడ్‌కు కీలక మార్కెట్ అయిన గల్ఫ్‌లోని అన్ని థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయడానికి నిర్మాతలు ఎంత ప్రయత్నించిన ఫలితం దక్కలేదని తెలిపారు. ఇక, కొన్నిచోట్ల అసలు పర్మిషన్ కూడా లభించకపోవడంతో దీన్ని కొన్ని థియేటర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు చెప్పారు. కాగా, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కించడం వల్లే ఆయా దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు సమాచారం.
కాగా, గల్ఫ్ దేశాల్లో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ ఈ మూవీ భారత్ లో మాత్రం కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరబోతుంది. ఇప్పటివరకూ రూ.185 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రణ్‌వీర్ సింగ్ కథనాయకుడిగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఆదిత్యధర్ తెరకెక్కించాడు.
