Telangana to File Objections in Supreme Court on Polavaram–Nallamala Sagar Case: పోలవరం-నల్లమల్ల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. 13వ తేదీ పోలవరం-బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. 13వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు అభిషేక్ మను సింఘ్వితో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు.
READ MORE: Karthi : తమిళ హీరో ‘కార్తీ’ కోసం కథలు రెడీ చేస్తోన్న టాలీవుడ్ దర్శకులు
కాగా.. ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోలవరం బనకచర్ల లింక్‌లో మార్పులు చేసి నల్లమలసాగర్ వరకు తరలించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.. ఇటీవలే దాని డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)కు టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నల్లమలసాగర్ లింక్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ), నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ), కృష్ణా బోర్డు, గోదావరి బోర్డులు అభ్యంతరాలు తెలిపినా.. ఏపీ మొండిగా ముందుకెళ్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం..