Guahar Khan: రంజాన్ ఉపవాసంపై సింగర్ షాకింగ్ కామెంట్స్.. గౌహర్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guahar Khan Gives Strong Counter To Justin Bieber Couple: సెలెబ్రిటీ స్టేటస్ వచ్చిందంటే చాలు.. ప్రపంచంలో ఎవరికీ లేనంత జ్ఞానం తమకే ఉందన్నట్టు కొందరు తెలివితక్కువగా వ్యవహరిస్తుంటారు. ఒపీనియన్ పేరిట.. నోటికొచ్చింది మాట్లాడేస్తారు. ఆయా విషయాలపై కనీస అవగాహన ఉండకపోయినా.. ఏదో తెలిసినట్టు మాట్లాడుతుంటారు. ఇప్పుడు పాప్ సింగర్ జస్టిన్ బీబర్, అతని భార్య హైలీ బీబర్ కూడా అలాంటి ‘తెలివి’ ప్రదర్శించారు. తామెప్పుడూ పెట్టని రంజాన్ ఉపవాసంపై కాస్త ఓవర్‌గా వాగేశారు. దీంతో.. బాలీవుడ్ మోడల్, నటి గౌహర్ ఖాన్ వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.
Raashi Khanna : ఆ విషయంలో షారూఖ్ ఖాన్‌ను దాటేసిన రాశీ ఖన్నా
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
హిజాబ్ మోడర్న్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన బీబర్ జంట.. రంజాన్ ఉపవాసంపై మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘మేమైతే ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. మన ఆలోచన శక్తి మెరుగుపడాలన్నా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా.. మన శరీరానికి పోషకాలు కావాలి. ఆ పోషకాలు అందాలంటే.. మన పౌష్టికాహారం తినాలి. అందుకే.. మేము ఉపవాసం ఉండాలనే ఆలోచన చేయం. అయినా.. ఇలా కడుపు మాడ్చుకుని ఉపవాసాలు చేయడమేంటో మాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇందులో సెన్స్ లేదని అనిపిస్తోంది. అంతగా అవసరమైతే.. టీవీ చూడటం, సెల్‌ఫోన్ వాడటం మానేయాలే తప్ప.. ఇలాంటి తిండి మానేయడం ఏంటి? మరీ తెలివి తక్కువ వాళ్లలా ఉన్నారనిపిస్తోంది’’ అంటూ చెప్పుకొచ్చారు.
Chennai Super Kings: దయచేసి అతడ్ని తొలగించండి.. అతని వల్లే అనర్థాలు
ఈ వీడియో చూసిన గౌహర్ ఖాన్.. తన ఇన్‌స్టా స్టోరీలో వారి వీడియో షేర్ చేసి, గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘‘అసలు మీకేం తెలుసని రంజాన్ ఉపవాసం గురించి మాట్లాడుతున్నారు. ఆ ఉపవాసం వెనుక దాగి ఉన్న సైన్స్ గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి కొంచెం అయినా అవగాహన ఉందా? ముందు అవి తెలుసుకోండి. మీకంటూ ఓ అభిప్రాయం ఉండటం తప్పు కాదు. కానీ.. ఆ అభిప్రాయాన్ని ఎలా ఎలా వ్యక్తీకరించాలనే తెలివి కూడా ఉంటే బాగుంటుంది’’ అంటూ ఆ ఇద్దరికి చురకలంటించింది. ఇకపోతే.. తాను తల్లి కాబోతున్నందుకు తాను ఉపవాసాలు ఉండటం లేదని, దాని బదులు పేదవారికి ఆహారం పంపిణీ చేయాలని అనుకుంటున్నానని గౌహర్ పేర్కొంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!