Raashi Khanna : ఆ విషయంలో షారూఖ్ ఖాన్‌ను దాటేసిన రాశీ ఖన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raashi Khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రాశీ ఖన్నా. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో నటిస్తున్న అందాల భామల్లో రాశీ ఖన్నా ఒకరు. దాదాపు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడలో నటించిన రాశీ ఇప్పుడు బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేస్తోంది. రుద్ర వెబ్ సిరీస్ లలో నెగెటివ్ పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ మధ్య కాలంలో ఫర్జీ తో ప్రేక్షకుల ముందకొచ్చింది. ఆమె ఫర్జీలో తెలివైన బ్యాంక్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకుంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ షో ప్రేక్షకుల నుంచి అమితమైన ఆదరణను దక్కించుకుంది. దీని ఫలితంగా రాశీ ఖన్నాకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రచురించే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకుంది రాశీఖన్నా.
Read Also: Shivathmika: ఆ గ్యాప్‌లోనే ‘దొరసాని’కి అర్థమైందంట
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ సాధించి.. అందరినీ అవాక్కై్య్యేలా చేసింది. ఈ విషయం తెలిసి చాలా సంతోష పడ్డానని రాశీ చెప్పింది. ఈ విషయాన్ని మొదట తాను నమ్మలేదని, నిజమో కాదో తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టిందని తెలిపింది. తన తండ్రికి ఫోన్ చేసి ఈ ఆనందాన్ని పంచుకున్నానని తెలిపింది. ‘ఆయనకు ఐఎండీబీ గురించి ఏం తెలియదు. కానీ, నేను షారుఖ్ ఖాన్ కంటే మొదటి స్థానంలో ఉన్నానని చెప్పగానే ఆయన షాక్‌కు గురయ్యారు. నా జీవితంలో దీనిని ఓ మైలు రాయిగా భావిస్తాను’ అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ఫర్జీ వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. భారతదేశంలోనే ఎక్కువ మంది వీక్షించిన సిరీస్ గా ఫర్జీ రికార్డును నెలకొల్పింది. దాదాపు 3.7 కోట్ల మంది షోను వీక్షించారు అని అంచనా.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..