NTV Telugu Site icon

Viral Video: “క్రెటా” అడిగితే “వ్యాగన్-ఆర్” ఇచ్చారని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు..

Up

Up

Wedding: తాను కోరిన కారు కట్నంగా ఇవ్వలేదని వరుడు పెళ్లిని ఆపేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని రసూల్‌పూర్‌లో జరిగింది. తన కట్నం డిమాండ్‌ని నెరవేర్చకపోవడంతో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకు హ్యుందాయ్ క్రెటా కారును కట్నంగా అడిగితే, పెళ్లి కూతురు తల్లిదండ్రులు వ్యాగన్-ఆర్ కారును ఇస్తున్నారని తెలుసుకున్న వరుడు చివరి నిమిషంలో వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. పెళ్లికూతురు ఇంటికి వెళ్లకుండా బారాత్‌ని నిలిపివేశాడు. పెళ్లికొడుకును అమీర్ ఆలమ్‌గా గుర్తించారు.

Read Also: Karnataka: మూగవాడైన కొడుకుని మొసళ్లు ఉండే నదిలో విసిరేసిన తల్లి..

అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి కోసం అన్ని ఏర్పాటు చేయడంతో పాటు, కళ్యాణ మండపంలో అందరూ పెళ్లి కార్యక్రమం కోసం సిద్ధంగా ఉన్నారు. అయితే కారు విషయం తెలుసుకున్న వరుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. తమను న్యాయం చేయాలని పెళ్లికూతురు నగ్మా డిమాండ్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. నచ్చిన కారు ఇవ్వకపోవడంతో చివరి క్షణంలో తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని ఆమె విలపిస్తూ ఆరోపించింది. రూ.25 లక్షల కారు అడిగితే, తాము రూ.7 లక్షల కారు ఇచ్చినందుకు పెళ్లి రద్దు చేసుకున్నాడని, తమకు మోడీ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె కోరారు. పెళ్లికూతురు తండ్రి యాకుబ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న వరడు అమీర్ ఆలం పరారీలో ఉన్నాడు. అమీర్ ఆలం ప్రభుత్వ ఉద్యోగి అని, ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.