Allu Arjun: అల్లు అర్జున్‌కి మరో అరుదైన గౌరవం.. జీక్యూ అవార్డ్ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GQ honoured Allu Arjun with the title of Leading Man: పుష్ప: ద రైజ్ సినిమా చేసినప్పటి నుంచి.. అల్లు అర్జున్ కెరీర్ అనూహ్య మలుపు తిరిగిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా పుణ్యమా అని పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. అఫ్‌కోర్స్.. అంతకుముందు కూడా జాతీయంగా బన్నీకి క్రేజ్ ఉంది కానీ, ఈ సినిమా కారణంగా ఇతని క్రేజ్ అమాంతం పెరిగింది. రష్యాలోనూ విడుదల అయిన ఈ సినిమా.. ఫిల్మ్‌ఫేర్ సౌత్‌లో ఎన్నో పురస్కారాల్ని సొంతం చేసుకుంది. బన్నీకి ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్‌గా బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత జీక్యూ మెన్ మేగజైన్ 2022కి గాను.. జీక్యూ మెన్ ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారాన్ని అందుకున్నాడు. స్వయంగా జీక్యూ బృందమే హైదరాబాద్‌కు వచ్చి, బన్నీకి ఆ అవార్డ్‌ని అందజేసింది. అతడ్ని ‘లీడింగ్ మ్యాన్’ టైటిల్‌తో గౌరవించింది. ఐకానిక్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేకమైన పార్టీ నిర్వహించి మరీ, బన్నీకి ఈ అవార్డ్‌ని అందజేశారని సమాచారం.
కాగా.. ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో పుష్ప: ద రూల్ సినిమా విషయంలో దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీన్ని చాలా గ్రాండ్‌గా నిర్మించాలని ఫిక్సయ్యారు. నిజానికి.. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సీక్వెల్ ఫిబ్రవరిలోనే సెట్స్ మీదకి వెళ్లాల్సింది. కానీ.. ఇది పాన్ ఇండియా హిట్ అవ్వడం, సీక్వెల్‌పై భారీ అంచనాలు పెరగడంతో, పాన్ ఇండియా అప్పీల్ వచ్చేలా ఈ సినిమాకి మెరుగులు దిద్దాడు దర్శకుడు సుకుమార్. స్క్రిప్ట్ కోసమే చాలాకాలం సమయం తీసుకున్నాడు. కొత్తగా కొందరు పేరుగాంచిన నటీనటుల్ని కూడా తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?