Sri Tej :అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్స్ షో తొక్కిసలాటను ఎవరూ మర్చిపోలేదు. సంధ్య థియేటర్ లో జరిగిన ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు శ్రీ తేజ్ ఇప్పటికీ కోలుకోలేదు. కోలుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో శ్రీతేజ్ కు అండగా నిలబడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ట్రీట్ మెంట్ ఖర్చులు భరిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మిషన్ వాత్సల్య పథకాన్ని అందిస్తామని ప్రకటించింది.
Read Also : Upasana : సమాజం ఆడవారిని ఎంకరేజ్ చేయదు : ఉపాసన
ఈ పథకం కింద బాధిత కుటుంబానికి ప్రతి నెల ₹4,000 చొప్పున 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇప్పటి వరకు గడిచిన మూడు నెలలకు ₹4,000 చొప్పున మొత్తం ₹12,000, అలాగే బాలిక చదువు కోసం నేరుగా ఫ్యామిలీ అకౌంట్ లో డబ్బులు వేయనున్నారు. ఇది శ్రీతేజ్ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆర్థికంగా భరోసా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీతేజ్ కు ఇంకా ట్రీట్ మెంట్ జరుగుతూనే ఉంది. అడ్వాన్స్ టెక్నాలజీ సాయంతో శ్రీతేజ్ కు ఫిజియోథెరఫీ అందిస్తున్నారు. కొంత వరకు బెటర్ మెంట్ ఉన్నా.. పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం అంటున్నారు డాక్టర్లు.
Read Also : Parineeti Chopra : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..
