అఖిల్ ఏజెంట్లో కన్నడ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటే అప్పుడు దీన్ని జనం ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు తహతహ లాడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ మూవీలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో చిత్ర బృందం మంతనాలు జరుపుతోందట. ఉపేంద్ర నటించిన కన్నడ చిత్రాలు తెలుగులో డబ్ అవడంతో పాటు, ఉపేంద్ర స్ట్రయిట్ తెలుగు సినిమాలలోనూ హీరోగా నటించాడు. అంతేకాకుండా అవకాశం చిక్కాలే కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడానికి ఉపేంద్ర సిద్ధంగా ఉన్నాడు. అలా ఆ మధ్య త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్ మూవీ సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించాడు. అలానే ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న గని చిత్రంలోనూ ఉపేంద్ర ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఏజెంట్ మూవీకి వక్కంతం వంశీ కథను అందించాడు.అందులోని విలన్ పాత్రను ఉపేంద్ర పోషిస్తే బాగుంటుందని మెజారిటీ యూనిట్ సభ్యులు అభిప్రాయ పడుతున్నారని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో సైరావంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ఈ తాజా ప్రాజెక్ట్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడని అంటున్నారు.
Also Read
- Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని?
- Mrunal Thakur and Yashasvi Jaiswal: మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్..! వైరల్ వీడియోతో మొదలైన కొత్త చర్చ..
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Ranabaali : 'రణబాలి' వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
- Tags
- Agent
- Akhil
- Surender Reddy
- Upendra
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!