బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ , నటి తమన్నా భాటియా మధ్య ఉన్న రిలేషన్ కారణంగా చాలా కాలంగా వార్తల్లో నిలిచారు. కలిసి ఒక కార్యక్రమానికి హాజరైనా, హాజరవ్వకపోయినా తమన్నా భాటియా-విజయ్ వర్మ గురించి ఏదో ఒక వార్త తెర మీదకు వస్తూనే ఉంది. ఇక మీడియా కెమెరాల ముందు ఈ ఇద్దరూ కనిపించిన తీరును చూసి, ఈ సంబంధం ఖచ్చితంగా పెళ్లి దశకు చేరుకుంటుందని అందరూ అనుకునేవారు. కానీ ఎవరో ఈ జంటకు దిష్టి పెట్టినట్టు ఉన్నారు. అందుకే వారు బ్రేకప్ చెప్పుకున్నట్టు ఓ నేషనల్ మీడియా కథనాన్ని ప్రచురించింది. తాజా వార్తల ప్రకారం, తమన్నా భాటియా – విజయ్ వర్మ విడిపోయారు. తమన్నా భాటియా – విజయ్ వర్మ ఇకపై కలిసి జీవించకూడదని, విడిపోవాలని సంయుక్తంగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
Posani Krishna Murali: పోసానిని వదలని పోలీసులు.. గుంటూరు నుంచి కర్నూలుకు తరలింపు..
తమన్నా, విజయ్ ప్రేమికులుగా విడిపోయారు, అయితే విడిపోయినంత మాత్రాన వారు ఇకపై స్నేహితులుగా ఉండరని కాదు. వారు జీవితంలో ప్రేమికులుగా కాకుండా స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ తమ వృత్తి జీవితంలో చాలా బిజీగా ఉన్నారు, ఈ కారణంగా రాబోయే రోజుల్లో వారు తమ పనిపై దృష్టి పెట్టనున్నారు. తమన్నా భాటియా, విజయ్ వర్మ విడిపోతారని చాలా కాలం క్రితమే జనం ఊహించారు. ఎందుకంటే తమన్నా భాటియా, విజయ్ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసి ఫోటోలను పంచుకోవడం మానేశారు, ఆ తర్వాత ప్రజలు వారి రిలేషన్ గురించి చర్చించడం ప్రారంభించారు. తమన్నా భాటియా ఇటీవల ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్ తో పాటు మరికొన్ని మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి వెళ్ళింది. ఈ సమయంలో ఆమె ఒంటరిగా కనిపించింది.