మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన తాజా చిత్రం సూపర్ మచ్చి. రియా చక్రవర్తి – రచితా రామ్ ఈ సినిమాలో కథానాయికలుగా అలరించనున్నారు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా కాలమే అయింది. గతేడాదిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కరోనా వేవ్ తగ్గడానికి చాలానే సమయం పడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో మరిన్ని సినిమాలు ఓటీటీ బాటలోనే నడవనున్నాయని తెలుస్తోంది.