మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ రీ-ఎంట్రీ తర్వాత మాస్టర్
అనే మాస్ అండ్ క్లాస్ మూవీ చేశారు. సురేశ్ కృష్ణ దర్శకత్వంలో అల్లు అరవింద్ దాన్ని నిర్మించారు. ఇప్పుడు అన్న చిరు అడుగుజాడల్లో నడవబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించబోతున్న పీ.ఎస్.పీ.కే. 28లో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్ర పోషించబోతున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్
లో పోలీస్ ఆఫీసర్ గా దుమ్ములేపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడీ సినిమాలో లెక్చరర్ గా స్టూడెంట్స్ కు, ఇన్ డైరెక్ట్ గా ఆడియెన్స్ కు గట్టిగానే క్లాస్ పీకే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. విశేషం ఏమంటే… గతంలో ఎప్పుడూ ఇలాంటి లెక్చరర్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషించలేదు. మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్
తో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అందులో నల్లకోటు వేసుకున్న లాయర్ పాత్రకు మంచిగానే న్యాయం చేశాడు. మరి రేపు లెక్చరర్ గా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. పవన్, హరీష్ సెకండ్ కాంబో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే… పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు
, అయ్యప్పనుమ్ కోషియుమ్
రీమేక్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. వాటి తర్వాత సెట్స్ పైకి వెళ్ళేది ఈ సినిమానే!