Site icon NTV Telugu

Gopichand: ఏనుగు ఎక్కేందుకు సిద్ధం..?

Gopichand Hari Film

Gopichand Hari Film

ఇప్పుడు భారత చిత్రసీమలోని భాషా బేధాలు పూర్తిగా తొలగిపోయిన సంగతి తెలిసిందే! అక్కడి దర్శకులు ఇక్కడి హీరోలతోనో, ఇక్కడి దర్శకులు అక్కడి హీరోలతోనో జత కట్టేస్తున్నారు. ముఖ్యంగా.. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఈ క్రేజీ కాంబోలో బోలెడన్నీ కుదిరాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కలయిక చేరనున్నట్టు కనిపిస్తోంది. అదే.. డైరెక్టర్ హరి, మన మ్యాచో మ్యాన్ గోపీచంద్.

తమిళ దర్శకుడు హరి ఎప్పట్నుంచో తెలుగులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా.. సింగం సిరీస్‌తో తనకు తెలుగులోనూ మంచి పేరు రావడంతో, మన హీరోలతో కలిసి సినిమాలు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. కానీ, ఎందుకో ఆ ప్లాన్స్ వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్‌గా ఏనుగు సినిమా తీసిన ఈ దర్శకుడు కోరిక.. ఎట్టకేలకు ఇన్నాళ్లకు వర్కౌట్ అయినట్టు తెలుస్తోంది. మ్యాచో మ్యాన్ గోపీచంద్‌తో ఓ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నట్టు వార్తలు వస్తు్న్నాయి. కొన్నిరోజుల కిందట ఇతడు చెప్పిన ఓ స్టోరీ నచ్చడంతో.. గోపీచంద్ అందుకు పచ్చజెండా ఊపాడని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయమై అధికార ప్రకటన కూడా రానుందట! ఎంతైనా మాస్ సినిమాలకు హరి కేరాఫ్ అడ్రస్ కాబట్టి, ఆయన ట్రాక్ రికార్డ్ చూసి గోపీచంద్ సినిమాకి ఓకే చెప్పి ఉంటాడని తెలుస్తోంది.

నిజానికి.. హరి చెప్పిన కథ ఆల్రెడీ జూ. ఎన్టీఆర్‌కి వినిపించిందట! ఆర్ఆర్ఆర్‌కి ముందే అతను తారక్‌తో ఓ సినిమా కోసం చర్చలు జరిపాడు. అయితే.. తారక్ ఆర్ఆర్ఆర్‌కి కమిట్ అవ్వడం, కరోనా వల్ల ఆలస్యం అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకుండానే అటకెక్కేసింది. ఇప్పుడదే స్టోరీని గోపీచంద్‌కి వినిపించి, సినిమాకి హరి గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడని అంటున్నారు. కానీ, హరి ప్రస్తుతం ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఏనుగు తెలుగులో వచ్చినా, ఎవరూ పట్టించుకోవడం లేదు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో గోపీచంద్‌కి అతడు హిట్ ఇస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Exit mobile version