Gopichand Malineni Reveals A Secret About Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే! సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బృందం పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. తమ సినిమాకు మంచి ఆదరణ వస్తుండటంతో.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు గోపీచంద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా ఓకే అవ్వడానికి ముందు తాను బాలయ్యకు మరో స్టోరీ వినిపించానని, అది రిజెక్ట్ చేయడం వల్ల వీరసింహారెడ్డి కుదిరిందంటూ కొన్ని సీక్రెట్స్ రివీల్ చేశాడు.
Sarfaraz Khan: నీ కోచ్‌కే దిక్కులేదు..నువ్వెంత: సర్ఫరాజ్‌పై చీఫ్ సెలెక్టర్ ఫైర్
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘‘మొదట్లో బాలయ్యతో సినిమాతో అనుకున్నప్పుడు, రేసీగా ఒక రోజులోనే సాగే స్టోరీతో సినిమా చేయాలనుకున్నాను. ఆ స్టోరీని బాలయ్యకు వినిపించడం కూడా జరిగింది. అయితే.. స్టోరీ విన్న తర్వాత ఇది సరిపోదని బాలయ్య అన్నారు. ‘అఖండ’ లాంటి సినిమా తర్వాత నా నుంచి ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటారు కాబట్టి, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని బాలయ్య సూచించారు. దాంతో గతంలో రాసి పెట్టుకున్న ఒక స్టోరీని బయటకు తీసి, బాలయ్యకు వినిపించాను. స్టోరీ లైన్ చెప్పగానే, ఈ సినిమా మనం చేస్తున్నామని బాలయ్య చెప్పారు. ‘నేను సీమ నేపథ్యంలో సినిమా చేసి చాలా రోజులైంది, ఇప్పుడు ఇది చేస్తే బాగుంటుంది, కచ్ఛితంగా దీన్నే చేద్దాం’ అని బాలయ్య అన్నారు. దీంతో మూడు రోజుల్లోనే స్టోరీ పూర్తి చేసి, సెట్స్‌పైకి తీసుకెళ్లాం. ఇది తండ్రికొడుకుల కథ కావడంతో, పాత సినిమాలే గుర్తొస్తాయని, చెల్లెలు సెంటిమెంట్‌ని జోడించాం’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Public Urination : గోడలపై మూత్రం పోయాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
అంతేకాకుండా.. ఈ సినిమా కోసం తాము చాలా రిస్క్ తీసుకున్నామని గోపీచంద్ వెల్లడించాడు. బాలయ్య సినిమాల్లో సాధారణంగా రెండో పాత్ర ఇంటర్వెల్‌లో ఎంటర్ అవుతుందని, అయితే ఇందులో ఇంటర్వెల్‌లోనే ఆ పాత్రని ముగించామని చెప్పాడు. దాన్ని జస్టిఫై చేయడం కోసం.. ద్వితీయార్థాన్ని చాలా గ్రిప్పింగ్‌గా తీసుకెళ్లే ప్రయత్నం చేశానని డైరెక్టర్ పేర్కొన్నాడు. కాగా.. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా, ఆయన సరసన శృతిహాసన్, హనీ రోజ్ కథానాయికలుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రలు పోషించారు.
BMW: ఇది కారు కాదు.. ఊసరవెల్లి.. 240 రంగులు మారుస్తుందట..!!