కరోనా కారణంగా ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారో రారో అనే భయంలో ఉన్న ఇండస్ట్రీ వర్గాలకి నమ్మకం ఇచ్చిన సినిమా ‘క్రాక్’. మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. పర్ఫెక్ట్ మాస్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఇంటి నుంచి థియేటర్ కి రప్పించింది, మేకర్స్ ని మార్కెట్ పై నమ్మకం కలిగించింది. పోతరాజు వీరశంకర్ గా రవితేజ వింటేజ్ మాస్ ని చూపించాడు. క్రాక్ ఎండ్ లో క్రాక్ 2 ఉంటుంది అనే హింట్ ఇచ్చాడు గోపీచంద్. రవితేజకి కంబ్యాక్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని, ఈ ఇయర్ బాలకృష్ణతో కలిసి ‘వీర సింహా రెడ్డి’ సినిమా చేసాడు. బాలయ్యకి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన మలినేని, నెక్స్ట్ మూవీని దళపతి విజయ్ చేస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ గోపీచంద్ మలినేని దళపతి విజయ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవనుందనే న్యూస్ కోలీవుడ్ లో కూడా బాగా వైరల్ అయ్యింది. అయితే విజయ్, వెంకట్ ప్రభుతో సినిమా ఓకే చెయ్యడంతో గోపీచంద్ మలినేని-విజయ్ కాంబినేషన్ గురించి వార్తలు స్ప్రెడ్ అవ్వడం ఆగిపోయాయి. విజయ్ బిజీ అవ్వడంతో గోపీచంద్ మలినేని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే చెయ్యడానికి రెడీ అయ్యాడు. హీరోగా మరోసారి రవితేజ రంగంలోకి దిగాడట. రవితేజ-గోపీచంద్ మలినేనిలది హిట్ కాంబినేషన్, క్రాక్ మూవీతో ఈ కాంబోకి మరింత క్రేజ్ వచ్చింది. మరి ఇప్పుడు రవితేజ-గోపీచంద్ మలినేని కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో క్రాక్ 2 చేస్తారా? లేక వేరే కొత్త కథతో సినిమా చేస్తారా అనేది చూడాలి.