Bhimaa: ‘భీమా’ బ్రహ్మరాక్షసుడు.. అంతా శివుని ఆజ్ఞ : హీరో గోపీచంద్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gopichand Interview for Bhimaa Movie: మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
‘భీమా’ జర్నీ
ఈ సినిమా సహా నిర్మాత శ్రీధర్ కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని పరిచయం చేశారు. అప్పుడు ఫేస్ టైంలో ఒక కథ చెప్పారు హర్ష. కథ బాగుంది కానీ ఇలాంటి సమయంలో వద్దనిపించింది. పోలీస్ కు సంబధించి ఏదైనా డిఫరెంట్ కథ వుంటే చెప్పమన్నా, ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని భీమా ‘కథ’ చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్, కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా మొదలైయింది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
‘భీమా’ బ్రహ్మరాక్షసుడు
రాక్షసుడిని చంపాలంటే బ్రహ్మరాక్షసుడు రావాలని అలా పెట్టారు, అయితే భీమా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. భీమా పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూసి బయటకు వచ్చాక భీమా ప్రేక్షకుల మనసులో నిలబడిపోతాడనే నమ్మకం వుంది. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశారు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కి ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం వుంది.
వాటికి భీమాకి తేడా
గోలీమార్ లో డిఫరెంట్ కాప్, ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపథ్యం పోలీసు కథ. శౌర్యం కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. ఇలాంటి పోలీసుల కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది. అదే నాకు చాలా ఆసక్తి కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది.
‘అఖండ’తో పోలిక
నిజానికి అసలు ‘అఖండ’తో పోలిక లేదు. అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వలన అలా అనిపించవచ్చు ఏమో కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. అయితే నిజంగా ‘అఖండ’ పోలిస్తే మంచిదేగా. భీమా పరశురామ క్షేత్రంలో జరిగే కథ. అందుకే ఇలాంటి నేపథ్యం తీసుకున్నాం.
రవి బస్రూర్ మ్యూజిక్
ట్రైలర్ లో రవి బస్రూర్ మ్యూజిక్ అద్భుతంగా వుంది. దానికి మించి సినిమాలో ఉంటుంది. మంచి మ్యూజిక్ ఇవ్వాలనే అంకితభావంతో పని చేశారు.
సినిమాలో శివుని నేపథ్యం ఉంది. సినిమా మహా శివరాత్రికి వస్తుంది.. ఇలా ప్లాన్ చేశారా ?
లేదండీ. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను.
తాజావార్తలు
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!