‘శేష్ జోనర్’ అంటూ ‘అడివి శేష్’ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. అడివి శేష్ ని ఆడియన్స్ ఎక్కువగా నమ్మడానికి ముఖ్య కారణం ‘గూఢచారి’ సినిమా. ఒక మీడియం బడ్జట్ లో స్పై థ్రిల్లర్ సినిమాని హై రేంజ్ విజువల్స్ తో చూపించొచ్చు అని నిరూపించడంలో అడివి శేష్ సక్సస్ అయ్యాడు. ఈ సినిమా నుంచే అడివి శేష్ ఫ్యూచర్ స్టార్ అనే మాట వినిపించడం మొదలయ్యింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పై థ్రిల్లర్ సినిమాలకి మళ్లీ ఊపిరి పోసిన ‘గూఢచారి’ మూవీ నుంచి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గూధచారి పార్ట్ 2 ‘G2’ని గ్రాండ్ లెవల్లో అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. మిడ్ 2024లో రిలీజ్ కానున్న ఈ మూవీని ఎలా తెరకెక్కించబోతున్నారు? ఏ స్కేల్ లో G2 ఉండబోతుంది అనే విషయాన్ని ఆడియన్స్ కి ముందే చూపించాలి అని ఫీల్ అయిన అడివి శేష్, మేకర్స్ తో కలిసి ‘G2 ప్రీ-విజన్’ వీడియోని రిలీజ్ చేశాడు. ఈవెంట్ చేసి మరీ ఈ ప్రీవిజన్ వీడియోని రిలీజ్ చేసిన అడివి శేష్, ఎప్పటిలానే రిచ్ విజువల్ ని చూపించాడు.
ఈ ‘G2 ప్రీ-విజన్’ అనౌన్స్మెంట్ ఈవెంట్ లో అడివి శేష్ మాట్లాడుతూ… “మన సినిమాలని హాలీవుడ్ వాళ్లని ఎలా అట్రాక్ట్ చేస్తాయో రాజమౌళిగారు నిరూపిస్తున్నారు. అదే ఇన్స్పిరేషణ్ తో గూఢచారి వరల్డ్ ని ఒక ఫ్రాంచైజ్ గా మార్చి, ప్రపంచస్థాయికి తీసుకోని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాము. దాదాపు ఏడాదిన్నర పాటు కష్టపడి G2 సినిమాని హ్యుజ్ స్కేల్ లో ఆడియన్స్ ముందుకి తెస్తాం” అని చెప్పాడు. మూడు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసి, అయిదు దేశాల్లో G2 సినిమాని షూట్ చెయ్యనున్నారు. వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాయి.