Site icon NTV Telugu

Kantara: కాంతారా సినిమా అభిమానులకు గుడ్ న్యూస్!

Kantara Prequel Draft

Kantara Prequel Draft

Good News For Kantara Movie Lovers: కాంతార సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. తొలుత ఒక రీజనల్ మూవీగా రిలీజైన ఆ చిత్రం.. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాగా రిలీజై, దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. కనీవినీ ఎరుగని స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో.. ఈ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా అద్భుత విజయాన్ని అందుకున్న రిషభ్ శెట్టి.. ఆ హిట్‌ని క్యాష్ చేసుకోవడం కోసం ‘కాంతార 2’కి ప్లాన్ చేశాడు. ఇది కాంతార చిత్రానికి ప్రీక్వెల్. ఇప్పుడు తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కాంతార 2 స్క్రిప్ట్ మొదటి డ్రాఫ్ట్ ఫైనల్ అయ్యిందని సమాచారం. ఇది కాంతార అభిమానులకు నిజంగా పండగలాంటి వార్తేనని చెప్పుకోవచ్చు.

Anasuya – Vijay Deverakonda: అనసూయ, విజయ్‌ల మధ్య గొడవకు కారణం అదేనా..?

ఈ మొదటి డ్రాఫ్ట్‌తో రిషభ్‌తో పాటు అతని టీమ్ సంతృప్తిగా ఉందని, ఇంకొంత సమయం తీసుకొని అతడు స్క్రిప్ట్‌ని రివ్యూ చేయనున్నాడని తెలిసింది. మార్పులు అవసరమా? లేదా? అనేది తేల్చుకొని.. ఫైనల్ స్క్రిప్ట్‌ని ఖరారు చేయనున్నాడట. అంతేకాదండోయ్.. ఈ ప్రీక్వెల్ కోసం ఇప్పటికే లొకేషన్స్‌ను వెతికే పనిలోనూ నిమగ్నమయ్యారట. ఇప్పటికే కోస్టల్ కర్ణాటకలో కొన్ని లోకేషన్స్‌ను చూసినట్టు తెలిసింది. ఈ కాంతార 2 సినిమా షూటింగ్‌ను వర్షాకాలం నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. కాంతార బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది కాబట్టి, ఈ ప్రీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. ఇందులో ‘భూతకోల’ ఆచారాన్ని ప్రధానంగా చూపించనున్నారు కాబట్టి, ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వేచి చూస్తున్నారు.

Musical Love Entertainer: పాదం పరుగులు తీస్తే… ‘మరువతరమా’!

సాధారణంగా సినిమాలకు సీక్వెల్ ఉండటం సహజం. కానీ.. ఇక్కడ రిషభ్ శెట్టి ‘కాంతార’కి ప్రీక్వెల్ చేస్తున్నాడు. అంటే.. ఇప్పుడు చూసిన కథ కంటే ముందు అసలు ఏం జరిగిందనేది ఇందులో చూపించనున్నారు. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కాంతార’ సినిమా.. ఏకంగా రూ.500 కోట్ల వరకూ కలెక్షన్స్ రాబట్టింది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీలో కూడా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.

Exit mobile version