Site icon NTV Telugu

Good Luck Sakhi: ఓటిటీలోనైనా ‘మహానటి’కి లక్ కలిసొస్తుందా..?

keerthy suresh

keerthy suresh

నేను శైలజ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న అమ్మడు మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్తానం సంపాదించుకొంది. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కానీ, అవేమి బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయాన్ని అందుకోలేదు. ఇక తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే.

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 28 న రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటీ డేట్ ని ఫిక్స్ చేసుకోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఒక గ్రామీణ యువతీ తన పట్టుదలతో షూటర్ గా ఎలా గెలిచింది..? అనే కథతో తెరకెక్కిన ఈ సినిమాను ఓటిటీలో ప్రేక్షకులు ఆదరిస్తారా..? కనీసం ఓటిటీలోనైనా మహానటి లక్ కలిసొస్తుందా..? అనేది చూడాలి. ఇక ఈ చిత్రంలో కీర్తి సరసన ఆది పినిశెట్టి కనిపించగా, షూటింగ్ కోచ్ గా జగపతి బాబు నటించారు.

Exit mobile version