మా ప్రెసిడెంట్ అయితే సినిమాలు చేయకూడదని, రాజ్యాంగంలో ఏమైనా ఉందా.. మా ప్రెసిడెంట్ ఏమైనా ఇండియా ప్రెసిడెంట్ పదవినా.. అయినా మా ప్రెసిడెంట్, బిజినెస్‌మేన్ అయినంత మాత్రాన సినిమాలు చేయకూడదా.. అసలు మంచు విష్ణు సినిమాలు చేయాలా.. వద్దా అనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకే విష్ణు ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఇస్తూ.. తన కొత్త సినిమ టైటిల్ అనౌన్స్ చేశాడు. అది కూడా పాకిస్తాన్ పేరు తరహాలో ఉండడంతో.. ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇంతకీ ఏంటా టైటిల్..!
మంచు విష్ణు మంచి హిట్ కొట్టి చాలా కాలమే అయింది. గతేడాది భారీ అంచనాల మధ్య వచ్చిన మోసగాళ్లు చిత్రం కూడా అలరించలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత మా ప్రెసిడెంట్‌గా ఎన్నికవడంతో.. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు విష్ణు. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని.. ఓ ఫన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా.. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఇంట్రెస్టింగ్ వీడియోతో అనౌన్స్ చేశారు. ఇంతకు ముందు గాలి నాగేశ్వరరావు అనే టైటిల్ వినిపించగా.. ఇప్పుడు దాన్ని షార్ట్ చేస్తూ.. జిన్నాగా ప్రకటించారు. ఇందుకోసం ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు విష్ణు. ఇందులో విష్ణు, సునీల్, రచయిత కోన వెంకట్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫర్ చోటా కె నాయుడు, దర్శకుడు సూర్య.. సరదాగా ముచ్చటించుకుంటూ టైటిల్‌ను రివీల్ చేశారు. వీళ్లంతా మీరు మా ప్రెసిడెంట్ కదా.. అయినా సినిమా చేస్తున్నారా.. అంటూ విష్ణును ప్రశ్నించారు. ఈ విషయంలో విష్ణు ఫ్రస్టేట్ అవడంతో.. ఈ వీడియో ఫన్ జనరేట్ చేసింది. ఇక ‘జిన్నా’ టైటిల్ పై.. ఇదేంటి పాకిస్తాన్ తో కనెక్షన్ అన్నట్లుగా ఉందని కామెంట్స్ చేశాడు విష్ణు. కానీ సినిమాలో హీరో పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు అని.. దాన్నే షార్ట్‌గా మార్చుకుని ‘జిన్నా’ అని పిలిపించుకుంటూ ఉంటాడని క్లారిటీ ఇచ్చాడు కోన వెంకట్. ఏదేమైనా జిన్నా టైటిల్ మాత్రం.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
