మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర గని. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాను సిద్దు ముద్ద- అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉందన్న విషయం తెలుస్తోంది.. ట్రైలర్ విషయానికొస్తే.. తల్లికి తెలియకుండా బాక్సింగ్ నేర్చుకుంటూ ఉంటాడు గని.. ఎలాగైనా తన తల్లికి ఈ విషయం తెలిసేసరికి తాను నేషనల్ ఛాంపియన్ అవ్వడమే లక్ష్యంగా కష్టపడుతూ ఉంటాడు.. ఇక గనిని ఓడించడానికి మరో యంగ్ హీరో నవీన్ చంద్ర పోరాడుతూ ఉంటాడు.
ఇక మధ్యలో స్పోర్ట్స్ రాజకీయాలు గనినినేషనల్స్ కి వెళ్లకుండా అడ్డుకుంటాయి. వాటన్నింటిని తట్టుకొని గని ముందుకు వెళ్లాడా.. అతని విజయంలో కోచ్ సునీల్ శెట్టి పాత్ర ఎంత.. ఇక గని తల్లి ఎందుకు బాక్సింగ్ వద్దంటుంది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ లో వరుణ్ లుక్, నటన ఆకట్టుకున్నాయి. ఇక కోచ్ గా సునీల్ శెట్టి కనిపించగా, నదియా, వరుణ్ తల్లిగా కనిపించింది. ఇక జగపతి బాబు వరుణ్ తండ్రిగా కనిపిస్తున్నాడు..ఉపేంద్ర పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఇక హీరోయిన్ సయీ మంజ్రేకర్ తో వరుణ్ కి మంచి లవ్ ట్రాక్ వారి కెమిస్ట్రీ బాగుంది. ఇక థమన్ నేపధ్య సంగీతం హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్.. ఏప్రిల్ 8 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
