గెట్ రెడీ… రేపు “సీటిమార్” మెగా అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచో హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ “సీటిమార్” విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్లను జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్ కు విశేషమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అందులో మెగా అప్డేట్ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం విశేషం. రేపు ఉదయం 10 గంటలకు ఈ అప్డేట్ రానుంది. “సీటిమార్” ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ గెస్ట్ గా రావచ్చని, అదే విషయాన్ని రేపు టీం ప్రకటిస్తుందని అంటున్నారు. మరి టీం ప్రకటించబోయే ఆ మెగా అప్డేట్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also : మీ మాటలు గ్రేటెస్ట్ రివార్డులు… అమితాబ్ కు సూర్య రిప్లై
Also Read
యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రంలో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. వినాయక నాయక చవితి కానుకగా “సీటిమార్” థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!