గెహానా వశిష్ఠ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఒకప్పుడు అంటే అమ్మడు బూతు సినిమాల్లో నటించేది అని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చేది. ఎప్పుడంటే బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యాడో అప్పుడే అమ్మడి పేరు సంచలనంగా మారింది. ఈ కేసులో కొన్ని రోజులు జైల్లో కూడా ఉండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చి మళ్లీ రచ్చ షురూ చేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారును పిచ్చెక్కించే ఈ భామకు అర్జెంట్ గా బాయ్ ఫ్రెండ్ కావాలట.. తనకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలో తెలుపుతూ అమ్మడు స్పెషల్ పోస్ట్ పెట్టింది. అందులోను కండిషన్స్ అప్లై చేసింది.. రాత్రి 8 గంటలవరకే బాయ్ ఫ్రెండ్ కావాలట.
“నాకు వీలైనంత త్వరగా ఒక తోడు కావాలి. బాయ్ ఫ్రెండ్ రూపంలో ఆ తోడు కోరుకుంటున్నాను. బాగా అందగాడు.. డబ్బున్న వ్యక్తి.. తెలివైనవాడు.. ఈ క్వాలిటీస్ ఉన్న ఎవరైనా నాకు మెసేజ్ చేయండి. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కావాలి. అప్పటి వరకు ఈ విషయాన్ని నేను లాక్ చేయాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. డైరెక్ట్ గా శృంగార తారే బాయ్ ఫ్రెండ్ కావాలి అంటుంటే కుర్రకారు ఎందుకు ఆగుతారు.. వరుసగా అమ్మడికి మెసేజ్ ల మీద మెసేజ్ లు చేస్తున్నారట. మరి ఈ భామకు కావాల్సిన ఘనుడు దొరికాడో లేదో చూడాలి.