టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే భారి సినిమాలు ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ లో ‘గీతా ఆర్ట్స్’ టాప్ ప్లేస్ లో ఉంటుంది. స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ తో భారి సినిమాలు చేసే ఈ బ్యానర్ నుంచి… చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడానికి ‘గీత ఆర్ట్స్ 2’ అనే బ్యానర్ బయటకి వచ్చింది. అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడు అయిన ‘బన్నీ వాసు’ సూపర్ విజన్ లో ‘గీత ఆర్ట్స్ 2’ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. 2015లో నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో మొదలైన గీత ఆర్ట్స్ 2 ప్రయాణం, టాలీవుడ్ లో ఎంతోమంది యంగ్ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘ప్రతి రోజు పండగే’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ లాంటి హిట్ సినిమాలని ఇచ్చిన ఈ బ్యానర్ నుంచి తాజాగా వచ్చిన సినిమా ’18 పేజస్’.
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఫస్ట్ వీక్ లో 20 కోట్ల గ్రాస్ ని రాబట్టి క్లీన్ హిట్ వైపు వెళ్తోంది. ఈ మూవీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ‘బన్నీ వాసు’ ‘NTV’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గీత ఆర్ట్స్ 2’ నుంచి రాబోయే సినిమాల గురించి మాట్లాడాడు. “గతంలో ఒక సినిమా కంప్లీట్ అయ్యాక ఇంకో సినిమాని మొదలు పెట్టే వాళ్లం, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం… 2023లో GA2 నుంచి 11 సినిమాలు వస్తున్నాయి. అల్లు అరవింద్ గారు అవకాశం ఇచ్చినట్లే, మేము ఇంకొంతమంది కొత్త వాళ్లకి ఛాన్స్ ఇస్తున్నాం. టాలెంట్ ఎక్కడ ఉన్నా వాళ్లతో సినిమా చేస్తున్నాం” అంటూ బన్నీ వాసు చెప్పాడు. మరి GA2 నుంచి 2023లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి, అందులో ఎవరు నటిస్తున్నారు, ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.
వచ్చే సంవత్సరం మా సంస్థ నుండి 11 సినిమాలు రాబోతున్నాయి – ప్రొడ్యూసర్ బన్నీ వాసు
FULL VIDEO – https://t.co/z0jY8LhZuq@GeethaArts @Ga2Pictures#BunnyVas #AlluAravind #GeethaArts #vinarobhagyamvishnukatha #Tollywood #NTVTelugu #NTVENT pic.twitter.com/aOay5Lsynn
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) December 30, 2022