Site icon NTV Telugu

Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’లో యంగ్ హీరో సర్ప్రైజ్ ఎంట్రీ

Tharun Bhascker

Tharun Bhascker

టైటిల్‌తోనే వైబ్ క్రియేట్ చేసి, టీజర్‌తో అంచనాలను పెంచేసిన లేటెస్ట్ మూవీ ‘గాయపడ్డ సింహం’, క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. అయితే, ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అదేమంటే ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడట. కేవలం అలా వచ్చి వెళ్లడం కాకుండా, ఆ హీరో ఎంట్రీ ఇచ్చే సీన్ మరియు ఆ మొత్తం ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం, ముఖ్యంగా ఆ ట్రాక్‌లో వచ్చే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమని ఇన్‌సైడ్ టాక్. తరుణ్ భాస్కర్ మార్క్ మేకింగ్‌కు ఆ హీరో టైమింగ్ తోడైతే, ఆ సీన్ ‘స్పెషల్ అట్రాక్షన్’ అవ్వడంలో సందేహం లేదు.

ఇంతకీ ఆ గెస్ట్ రోల్ చేస్తున్న హీరో ఎవరనే కదా మీ సందేహం? మీకో చిన్న క్లూ.. ఈ యంగ్ హీరో గతంలో కూడా ఒక సినిమాలో ఇలాగే మెరుపుతీగలా మెరిసి, తనదైన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ చిన్న పాత్రతోనే సినిమా స్థాయిని పెంచేశాడు. మరి ‘గాయపడ్డ సింహం’లో ఆ ‘సింహం’ లాంటి ఎంట్రీ ఇవ్వబోతున్న హీరో ఎవరనేది మీరు గెస్ చేయగలరా? సినిమా యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రాకముందే, ఈ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తరుణ్-ఫరియా కాంబోకి ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ మరింత బలాన్ని ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

Exit mobile version