Gouthami : హీరో ధర్మతో రీతూ చౌదరి ఎఫైర్ పెట్టుకుందని.. అతని భార్య గౌతమి చౌదరి చేస్తున్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మ తండ్రి కూడా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ ఆరోపణలు చేశాడు. తన కొడుకును బ్లాక్ మెయిల్ చేసి కోట్లు కావాలంటూ గౌతమి డిమాండ్ చేసిందంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా గౌతమి స్పందించింది. ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ.. ధర్మ తండ్రి చేసిన ఆరోపణలన్నీ అబద్దమే. నేను కోట్లు అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపించినా నేను రాళ్లతో కొట్టించుకుని చనిపోతా అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.
Read Also : OG : ఓజీలో విలన్ రోల్ మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
ఒక కొడుకు అలా వేరే అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకుంటే.. కన్నతండ్రి సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్. నేను చాలా పవిత్రమైన దాన్ని. నా భర్త అలా వేరే అమ్మాయిలతో తిరిగి నా దగ్గరకు వస్తానంటే నేను ఒప్పుకోను. అందుకే నేను బయటకొచ్చి మాట్లాడుతున్నాను. నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. వాటికి నేను భయపడను. నా కొడుకు గురించే నాకు ఆలోచన. నా భర్త తన కొడుకు గురించి ఎందుకు ఆలోచించట్లేదు. నా కొడుకుకు ఎంత ఆస్తి ఇస్తారో ఎందుకు చెప్పట్లేదు అంటూ గౌతమి సంచలన వ్యాఖ్యలు చేసింది.
Read Also : Sujith : ఎవరీ సుజీత్.. అతని ఆస్తులు, చదువు ఏంటంటే..?