Gangula Kamalakar Released Das Ka Dhamki Trailer In Karimnagar: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తూ.. తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘దాస్ క ధమ్కీ’ సినిమా ఈ నెల 22వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ట్రైలర్ లాంచ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగులా కమలాకర్.. ధమ్కీ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కి తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, తెలంగాణ టీవీ అండ్ మూవీ కార్పోరేషన్ ఛైర్మెన్ అనిల్‌లతో పాటు హీరో విశ్వక్సేన్, హీరోయిన్ నివేద పేతురాజ్‌లు హాజరయ్యారు.
Smallest Countries: ప్రపంచంలోని 10 అత్యంత చిన్న దేశాలు (జనాభా ప్రకారం)
ఈ సందర్భంగా మంత్రి గంగులా కమలాకర్ మాట్లాడుతూ.. విశ్వక్సేన్ అంటే దేవుళ్లకి అధిపతి అని వివరించారు. సెంటిమెంట్‌కు మారుపేరు కరీంనగర్ గడ్డ అని.. ఇక్కడ సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఉండదని అన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందని అని వ్యాఖ్యలు చేసిన వారికి.. ఇలాంటి కార్యక్రమాలే నిదర్శనమని జవాబిచ్చారు. గతంలో కరీంనగర్ రావాలంటే భయం ఉండేదని, కానీ ఇప్పుడు చాలా ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను కూడా కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని ఆయన చిత్రబృందాన్ని కోరారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ తర్వాత కరీంనగర్‌లో సినిమా షూటింగ్‌లు జరిగేలా అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. త్వరలోనే కరీంనగర్‌ని ఫిలిం హబ్‌గా మారుస్తున్నామన్నారు. కరీంనగర్‌లో అందమైన లోకేషన్స్ ఉన్నాయని.. మరిన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
RRR Oscars: నాటు నాటుకి ఆస్కార్ వస్తుందా.. బెట్టింగ్ రాయుళ్ల దందా షురూ
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. యూత్ కావాల్సిన బోల్డ్ కంటెంట్‌తో పాటు కమర్షియల్ అంశాలను ఈ సినిమాలో విశ్వక్సేన్ దట్టంగా మలిచినట్టు తెలుస్తోంది. ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేసే ఓ యువకుడు.. తనలాగే ఉన్న ఓ కోటీశ్వరుడి స్థానంలోకి వస్తే జరిగే పరిణామాలేంటి? అనే చిక్కుముడులతో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ‘ఫలక్‌నుమా దాస్’తో యూత్‌లో మాస్ ఫాలోయింగ్‌కి విశ్వక్సేన్ పొందాడు కాబట్టి.. ఇందులో మాస్ ఎలిమెంట్స్‌ని బాగానే పెట్టినట్టు తెలుస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మరి.. సినిమా ఎలా ఉంటుందో రిలీజ్ వరకు చూడాలి.