బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ తో ఈ బ్యూటీ ఈ ఏడాది టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అలియా నటించిన మరో భారీ చిత్రం గంగూభాయి కతియావాడీ. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అలియా ఒక వైశ్యగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంది. కాగా కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మరో కొత్త రిలీజ్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఫిబ్రవరి 25 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ ను ఫిబ్రవరి 4 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయాన్ని అలియా ట్వీట్ చేస్తూ గంగూ వస్తోంది అంటూ ట్రైలర్ డేట్ ని తెలిపింది. ఈ చిత్రంలో గట్సీ వేశ్యా గృహ నిర్వాహకురాలుగా ఆలియా నటన నభూతోనభవిష్యతి అన్న తీరుగా ఉంటుందని తెలుస్తోంది. టీజర్ లో కూడా అలియా నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇంత చిన్న వయస్సులోనే అంతటి పెద్ద పాత్రను పోషించి అందరిచేత ఔరా అనిపించింది అలియా.. మరి ఈసినిమాతో అమ్మడు మరో నేషనల్ అవార్డును కైవసం చేసుకుంటుందేమో చూడాలి.
Aa Rahi Hai Gangu 🌙
— Alia Bhatt (@aliaa08) February 2, 2022
Trailer out on 4th February#GangubaiKathiawadi in cinemas on 25th February, 2022#SanjayLeelaBhansali @ajaydevgn @prerna982 @jayantilalgada @PenMovies @bhansali_produc @saregamaglobal pic.twitter.com/m0NZ5aksLo