Gangs Of Godavari Teaser Released: గామి హిట్ తో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఆయన ‘ఛల్ మోహన్ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమా చేశాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా మే 17న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ను చూస్తే అది ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంది. ఒక్కసారి లంకలో కత్తి కట్టారంటే ఆ మనిషిని సంపకుండా వదలరు.. అనే డైలాగ్ తో మొదలైంది టీజర్, ఊరంతా విశ్వక్ ని చంపడానికి చూస్తున్నట్టు, విశ్వక్ వారిని ఎదుర్కొన్నట్టు చూపించారు.
Kalki 2989 AD: కల్కి దిగే టైం చెప్పేశారు.. ఇక రెడీ అవండమ్మా!
అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కోడికి శివాలెత్తి పోద్దంతే.. అనే పవర్ ఫుల్ డైలాగ్ తో విశ్వక్ ను మాస్ యాంగిల్ లో చూపించారు. ఇక ఈ టీజర్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయనే చెప్పాలి. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్ నుంచి విడుదలైన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ వ్యక్తి ప్రయాణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.