Game on : చనిపోదామనుకున్న వ్యక్తి ఆడిన గేమే మా ‘గేమ్ ఆన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game on Producer Ravi Kasturi Interview: కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన మొదటి మూవీ గేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించగా సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా నిర్మాత రవి కస్తూరి సినిమా గురించి పలు విశేషాలు పంచుకున్నారు. రవి మాట్లాడుతూ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. గీతానంద్ హీరోగా, నేను నిర్మాతగా సినిమా చేయాలనుకున్నాం ఇప్పుడు మంచి కథ సెట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామన్నారు.. ప్రీ ప్రొడక్షన్ కి టైం ఎక్కువ కేటాయించి అంతా పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నామని, ఈ జర్నీలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందన్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్, రియల్ టైంలో సాగే కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించామని అన్నారు. యాక్షన్, ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుందని, జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడు అనేది గేమ్ థీమ్ లో చూపించామని అన్నారు.
Raviteja : కరైకుడికి రవితేజ-హరీష్ శంకర్
Also Read
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Ramcharan New Record : "పెద్ది"తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు... ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
సినిమా ప్రారంభం నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నామని పేర్కొన్న ఆయన నిర్మాతగా ఈ సినిమా నుంచి సహనంగా ఉండాలని నేర్చుకున్నానన్నారు. హీరో గీతానంద్ మా ఫ్రెండ్ కాబట్టి తనని ఎప్పటినుంచో చూస్తున్నా కచ్చితంగా తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని అన్నారు. తన బ్రదర్ దయానంద్ కి డైరెక్టర్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చానన్నారు, సినిమాలో నటించిన శుభలేఖ సుధాకర్ లాంటి మంచి మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు, సెట్లో చాలా సరదాగా ఉండేవారు. ఆదిత్య మీనన్ మంచి పర్ఫార్మర్, మధుబాలకి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనిపిస్తుందని అన్నారు. ఫస్ట్ కాపీ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ప్రేక్షకులు కూడా థ్రిల్ అవుతారని అన్నారు.. ఆస్ట్రేలియాలో వ్యాపారాలు చేస్తూ సినిమా చూసుకోవడం కాస్త ఛాలెంజింగ్ గానే అనిపించిందని పేర్కొన్న ఆయన ఇక్కడ పెద్ద సినిమా, చిన్న సినిమా అని రెండే క్యాటగిరిలు ఉన్నాయి. నాకు మాత్రం కంటెంట్ పై పూర్తి నమ్మకం ఉంది. ఇకపై నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నా, ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకు మరో పది సినిమాలకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే రెండు కథలు విన్నా ఈ సినిమా రిలీజ్ అయ్యాక వాటిని అనౌన్స్ చేస్తానని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!