గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో కుమార్ బాబు, రవి కస్తూరి, పమిడి రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘గేమ్ ఆన్’. ఫిల్మ్ నగర దైవ సన్నిధానంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో గీతానంద్, నేహా సోలంకిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త పమిడి రమేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Watch Acharya Pre release Event Live :
ఈ సందర్భంగా దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ, ”ఇండియన్ కోర్ ఎమోషన్స్ ఉండే రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది.యూత్ నుండి పెద్దవాళ్లు వరకు అందరికీ నచ్చేటట్లు ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక ఎమోషన్ సీన్ లో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు. రెండు షెడ్యూల్స్ లో ఈ సినిమాను పూర్తి చేస్తాం. సైకాలజికల్ ‘గేమ్ ఆన్’ తో వస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.ఇప్పుడు వస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందని, లూజర్ ఎలా విన్నర్ అయ్యాడన్నదే చిత్ర కథ అని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమా విజయం పట్ల గీతానంద్, నేహా సోలంకి, వాసంతి, కిరీటీ తదితరులు ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అశ్విన్ – అరుణ్ సంగీతం అందిస్తున్నారు
