గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో కుమార్ బాబు, రవి కస్తూరి, పమిడి రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘గేమ్ ఆన్’. ఫిల్మ్ నగర దైవ సన్నిధానంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో గీతానంద్, నేహా సోలంకిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త పమిడి రమేష్ కెమెరా…