Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను అందిస్తోంది. ఇప్పటికే 2024కు గాను అన్ని కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. అయితే తాజాగా 2014 జూన్ 2 నుంచి 2023 వరకు సెన్సార్ పూర్తయి విడుదలైన సినిమాలో ఉత్తమ సినిమా అవార్డులను జ్యురీ చైర్మన్ మురళీ మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కలిసి ప్రకటించారు. 2014లో బెస్ట్ ఫిలిం అవార్డు రన్ రాజా రన్ కు దక్కింది. సెకండ్ బెస్ట్ ఫిలిమ్ పాఠశాల, మూడో బెస్ట్ ఫిలిమ్ అల్లు డు శీను అవార్డులు దక్కించుకున్నాయి.
2015 లో బెస్ట్ ఫిలిం రుద్రమ దేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, మూడో బెస్ట్ ఫిలిమ్ గా శ్రీమంతుడు నిలిచాయి.
2016లో ఉత్తమ చిత్రంగా శతమానం భవతి నిలవగా.. రెండో బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, మూడో బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్ అవార్డులు గెలుచుకున్నాయి.
2017లో బాహుబలి-1 ఉత్తమ చిత్రంగా నిలిచింది. రెండో బెస్ట్ ఫిలిం ఫిదా, మూడో బెస్ట్ ఫిలిం ఘాజీ.
2018లో ఉత్తమ చిత్రం మహానటి, రెండో బెస్ట్ ఫిలిం రంగస్థలం, మూడో బెస్ట్ ఫిలిం కేరాఫ్ కంచెరపాలెం.
2019లో బెస్ట్ ఫిలిం మహర్షి, రెండో బెస్ట్ ఫిలిం జెర్సీ, మూడో బెస్ట్ ఫిలిం మల్లేశం.
2020లో బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, రెండో బెస్ట్ ఫిలిం కలర్ ఫొటో, మూడో బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలొడీస్.
2021లో బెస్ట్ ఫిలిం త్రిబుల్ ఆర్, రెండో బెస్ట్ ఫిలిం అఖండ, మూడో బెస్ట్ ఫిలిం ఉప్పెన.
2022లో బెస్ట్ ఫిలిం సీతారామం, రెండో బెస్ట్ ఫిలిం కార్తికేయ-2, మూడో బెస్ట్ ఫిలిం మేజర్.
2023లో బెస్ట్ ఫిలిం బలగం, రెండో బెస్ట్ ఫిలిం హనుమాన్, మూడో బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి అవార్డులు దక్కించుకున్నాయి.
స్పెషల్ జ్యురీ అవార్డు ప్రజాకవి కాలేజీకి అందించారు.
ఇవే కాకుండా ఆరు స్పెషల్ అవార్డులను కూడా అందించారు.
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు- నందమూరి బాలకృష్ణ
పైడి జయరాజ్ అవార్డు- మణిరత్నం
బీఎన్ రెడ్డి అవార్డు ఫర్ తెలుగు ఫిలిం బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ – అట్లూరి పూర్ణ చందర్ రావు
కాంతారావు అవార్డు – విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య ఫిలిమ్ అవార్డు – రచయిత యండమూరి వీరేంద్రనాథ్
వీరందరికీ అవార్డులను జూన్ 14న అందజేస్తామని తెలిపారు. ఐటెక్స్ లో ఈవెంట్ జరగబోతుందన్నారు. ఆ వేడుకకు అందరూ హాజరవుతారని తెలిపారు.
https://www.youtube.com/live/1yOMXYPSUvU