Gaami: అఘోరగా మారిన విశ్వక్ సేన్.. భయపెట్టేస్తున్నాడుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి.
విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విశ్వక్ అఘోరాగా కనిపించనున్నాడు. తాజాగా మేకర్స్ హైదరాబాద్ కామిక్ కాన్‌లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ ద్వారా ప్రమోషన్‌లను ప్రారంభించారు.
అఘోరా గెటప్‌లో విశ్వక్ సేన్ ఆశ్చర్యపరిచారు. పోస్టర్ ఆకట్టుకుంటుంది. చుట్టూ చాలా మంది అఘోరాలు అతనిని తాకడానికి ప్రయత్నిస్తారు. పోస్టర్ టెర్రిఫిక్ గా వుంది. డార్క్ మిస్టీరియస్ ఫీలింగ్ ని కలిగిస్తోంది. ఆడియన్స్ లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ‘శంకర్’ అనే అఘోరాగా కనిపించనున్నాడు. తనకి చాలా రేర్ కండీషన్ వుంటుంది. అతను ఏ మానవ స్పర్శను అనుభవించలేడు అని మేకర్స్ అనౌన్స్ చేశారు. పోస్టర్‌పై “His biggest fear, is human touch… His deepest desire, is also human touch” అనే ట్యాగ్‌లైన్ వుంది. ఇది ఆ పాత్ర భావోద్వేగ సంఘర్షణ యొక్క లోతును తెలిజేస్తుంది.
Also Read
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
- ‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
దర్శకుడు విద్యాధర్ మాట్లాడుతూ, “ఈ చిత్రంలో అఘోరా సెటప్‌తో పాటు, రెండు విభిన్నమైన సెటప్‌లు, ఇతర పాత్రలు ఉన్నాయి. ప్రమోషన్స్ లో వాటి గురించి రివిల్ చేస్తాం” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ఎంజి అభినయ, హారిక, మహ్మద్ సమద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!