సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడం గ్యారెంటీ. సినిమాల గురించి మాట్లాడినా, సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చినా, పాలిటిక్స్ గురించి అయినా సరే ఆర్జీవీ నుంచి ఒక ట్వీట్ వచ్చింది అంటే ఇంటర్నెట్ సెన్సేషన్ అవ్వాల్సిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వర్మ, ఎప్పటిలాగే ఒక ఫోటోని పోస్ట్ చేసాడు. వర్మ స్పోర్ట్స్ బైక్ ఉన్న ఫోటోని పోస్ట్ చేసాడు, సరిగ్గా ఇలాంటి బైక్ పైన బికినీలో హీరోయిన్ అప్సరా రాణి ఉన్న ఫోటో కూడా ఒకటి ఉంది. ఆ ఫోటోని అప్సర రాణిని ట్యాగ్ చేస్తూ ఎవరు గెలుస్తారో చూద్దామా అంటూ వర్మ ట్వీట్ చేసాడు.
Read Also: Vaadivaasal: అసలు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా సూర్యా సర్?
నేనే గెలుస్తాను రేస్ లో వర్మ అంటూ వర్మ చేసిన ట్వీట్ కి… ఎవరు గెలుస్తారో చూద్దమా, రేస్ కి రెడీనా అంటూ అప్సర రాణి రిప్లై ఇచ్చింది. మరి వర్మ ముందుకి వచ్చి అప్సర రాణితో బైక్ రేస్ కి రెడీ అయితే చూసి బ్రేక్ ఇవ్వడానికి యూత్ సిద్ధంగా ఉంది. ఈ ఇద్దరిలో రేస్ జరిగితే ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే… సోషల్ మీడియాలో కాసేపు సరదాగా మాట్లాడుకోవడానికి ఇదో టాపిక్ అయ్యింది. అప్సర రాణితో వర్మ సినిమాలు చేస్తూ ఉంటాడు, ఆమె ఫేమ్ వచ్చిందే వర్మ వలన. ఇక సినిమాల విషయానికి వర్మ ప్రస్తుతం వ్యూహం సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ ఎజెండాతో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని కాంట్రవర్సీలకి దారితీస్తుందో చూడాలి. అప్సర రాణి మాత్రం అటు హీరోయిన్ గా వర్మ సినిమాల్లో నటిస్తూనే… భూమ్ బద్దలు లాంటి ఐటమ్ సాంగ్స్ లో కూడా చిందేస్తుంది.
https://twitter.com/_apsara_rani/status/1698297604679856420