Friday Releases: ఈ వారం వచ్చిన సినిమాల్లో ఏ సినిమా ఎలా ఉందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Friday Releases this Week: ఈ వారం 3 సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఎక్కువగా ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన డార్లింగ్ సినిమాకి బజ్ ఉంది. దానికి కారణం ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన హనుమాన్ నిర్మాతలు ఈ సినిమాను కూడా నిర్మించడమే. తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ముందు నుంచి భిన్నంగా చేసుకోచ్చారు కాబట్టి సినిమా మీద కూడా జనాల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వగా నిన్ననే రెండు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ఇక ఈ సినిమాకి మిక్స్ టాక్ వచ్చింది. సినిమా కొంతమందికి బాగా నచ్చేస్తుంటే కొంతమందికి మాత్రం అస్సలు ఎక్కడం లేదు. ప్రియదర్శి ఒకే కానీ నభా పాత్రలో కరెక్ట్ గా సెట్ అవ్వలేదని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. పలు పాత సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు.
Darling Movie Review: లేడీ అపరిచితురాలు ‘డార్లింగ్’.. ఎలా ఉందంటే?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక తమిళ నటుడు వినోద్ కిషన్ హీరోగా అనూష కృష్ణ హీరోయిన్ గా పేక మేడలు అనే సినిమా తెరకెక్కికింది. నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని బాహుబలి నటుడు రాకేష్ నిర్మించాడు. ఈ సినిమాకి కాస్త రొటీన్ కి భిన్నమైన సినిమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందరికీ నచ్చకపోవచ్చు కానీ భార్యాభర్తలకు కనెక్ట్ అవ్వచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా అంతా ఒకెత్తయితే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే భార్యా భర్తల ఫైట్ సీన్ మరో ఎత్తు. పేకమేడలు ఓటీటీలో వచ్చినపుడు హాయిగా చూసేయచ్చు.
Peka Medalu Review: పేక మేడలు రివ్యూ
ఇక మరోపక్క బర్త్ డే బాయ్.. అమెరికాలో ఐదుగురు స్నేహితులు.. అందులో ఒకడి బర్త్ డే.. సెలబ్రేషన్స్‌లో భాగంగా వాళ్లు చేసిన రచ్చకు బర్త్ డే బాయ్ చనిపోవడం అనే కథతో తెరకెక్కింది. దర్శకుడు విస్కీ ఫస్టాఫ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తో ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. బిగ్ బాస్ రవికృష్ణ, రాజీవ్ కనకాల తప్ప అంతా కొత్తోళ్లే. ఈ సినిమా కూడా ఓటీటీకి అయితే పర్ఫెక్ట్ ఛాయిస్.
The Birthday Boy Review: ‘ది బర్త్ డే బాయ్’ ఎలా ఉన్నాడంటే?
ఇక అంజలి ప్రధాన పాత్రలో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ళ కీలక పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ బహిష్కరణ. ముఖేష్ ప్రజాపతి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నిన్న రాత్రి నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బహిష్కరణ రా అండ్ రస్టిక్ థ్రిల్లర్.. ఫ్యామిలీలతో కలిసి చూడడం అవాయిడ్ చేయడం మంచిది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!