యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విలక్షణమైన సబ్జెక్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. తన మొదటి రెండు చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “సమ్మతమే”తో వస్తున్నాడు. గోపినాథ్ రెడ్డి దర్శకత్వంలో చాందిని చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్.
Read Also : “పుష్ప” ట్రైలర్ అప్డేట్… వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ఎప్పుడంటే ?
“కృష్ణ & సత్యభామ” అంటూ సాగిన మొదటి సింగిల్ హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ కథ ఎంత అందంగా ఉందో తెలియజేస్తోంది. ఈ పాటలో కిరణ్, చాందినిల రొమాంటిక్ ట్రాక్ కూడా చూడముచ్చటగా కనిపిస్తుంది. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మంచి రొమాంటిక్ సాంగ్ ను అందించారు. కృష్ణకాంత్ సాహిత్యం తెలుగు, ఇంగ్లీషు పదాల మేళవింపు, యాజిన్ నజీర్, శిరీషా భాగవతుల ఆహ్లాదకరమైన గానంతో ఈ పాట వినడానికి మరింత మనోహరంగా ఉంది.