Sri Sri Sri Rajavaaru First Look ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నితిన్ ఫస్ట్ మూవీకి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించగా, ఈ చిత్రానికి “శ్రీశ్రీశ్రీ రాజావారు” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈరోజు Sri Sri Sri Rajavaaru First Lookని మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌ను బట్టి చూస్తే నితిన్ ఫస్ట్ మూవీ కోసం మాస్ జోనర్ ను ఎంచుకున్నట్టుగా కన్పిస్తోంది. ఈ పోస్టర్ లో నితిన్ సిగరెట్ తాగుతూ కన్పిస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ లో ఏదో జాతరలా కన్పిస్తోంది.
Read Also : Vijay Devarakonda : హీరోయిన్ తో పార్టీ… వీడియో లీక్
మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండగా, ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారనే విషయాన్నీ మాత్రం మేకర్స్ సస్పెన్స్ లో ఉంచారు. మరి ఈ యంగ్ హీరో ఎంట్రీకి కొత్త హీరోయిన్ ను తీసుకుంటున్నారా ? లేక మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకుంటారా? అనేది చూడాలి. శ్రీ వేధాక్షర మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు కైలాస్ మీనన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.