చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు అంతకంతకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్లు కు భద్రత లేకుండా పోయింది. మొన్నటికి మొన్న నటుడు, నిర్మాత విజయ్ కుమార్ ని లైంగిక వేధింపుల క్సేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక తాజాగా మలయాళ స్టార్ డైరెక్టర్ సనల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్, అతడు వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
సనల్ దర్శకత్వంలో మంజు వారియర్ ‘కయాట్టం’ చిత్రంలో నటించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాకా కూడా అతడు ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నాడని, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా తన పద్దతి మార్చుకోకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సనాల్ ఇంటికి మఫ్టీలో వెళ్లి గురువారం అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సనాల్ కుమార్ మాలీవుడ్ లో పలు హిట్ సినిమాలు తీయడమే కాకుండా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. అలాంటి ఒక ప్రముఖ వ్యక్తి ఇంత నీచానికి ఒడిగట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళలను ఇబ్బందిపెట్టేవారకి ఇలాంటి శిక్షే పడాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.