Chandra Hass: సినిమా చూశాక నేను ఆ ట్యాగ్ కు అర్హుడిని కాదు అంటే తీసేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandra Hass Interview for Ramnagar Bunny: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తన ఇంటర్వ్యూలో తెలిపారు ‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ ఆయన మాట్లాడుతూ రామ్ నగర్ బన్నీ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా నా డెబ్యూ మూవీ కావడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఎంట్రీ మరొకరికి దొరుకుతుందని అనుకోను.
Veekshanam Teaser: ఆసక్తికరంగా “వీక్షణం” టీజర్
Also Read
- Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం... 'రామాయణం' వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
- Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్
- Srinidhi Shetty: రాగ పాత్రతో మరో ఫేస్ చూపించబోతోంది శ్రీనిధి.. ‘తెలుసు కదా’పై ఆసక్తికర కామెంట్స్!
- Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ కు వస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎగ్జైటింగ్ గా ఉన్నా, అయితే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందనే కాన్ఫిడెన్స్ మా టీమ్ అందరికీ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ గారు నా గురించి హీరో క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. అలాగే మా సినిమా చూసి మీకు నచ్చకుంటే నాకు మీ టికెట్ ఫొటోతో ఇన్ స్టా ద్వారా చెప్పండి మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పా, సినిమా మీద నమ్మకంతోనే అలా అన్నాను. ఈ సినిమాలో నేను సూపర్ హీరోలా కనిపించను. ఒక సాధారణ యువకుడిగానే కనిపిస్తా. నేను తిట్లు తింటా, అవమానాలు ఎదుర్కొంటా, రకరకాల జాబ్స్ చేస్తాను. కొన్నిసార్లు జాబ్ లెస్ గా ఉంటా, అన్నిరకాల ఎమోషన్స్ చేసే అవకాశం ఈ సినిమాతో కలిగింది. మా సినిమాను సకుటుంబంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లి చూడొచ్చు. ఒక పాటలో ముద్దు సీన్స్ ఉండేవి.
అయితే అవి సెన్సార్ లో కట్ చేయించాం, కిస్సింగ్ సీన్స్ సినిమాలో ఉండవు. నలుగురు హీరోయిన్స్ ఉన్నారు మా మూవీలో. వాళ్ల క్యారెక్టర్స్ కు పర్ఫార్మెన్స్ పరంగా మంచి స్కోప్ ఉంటుంది. మా సినిమాను మా నాన్నగారు ప్రభాకర్ ప్రొడ్యూస్ చేశారు. ముందు నేను వద్దనే అన్నాను. ప్రొడక్షన్ రిస్క్ ఉంటుంది. అయితే ఈ కథను మనం అనుకున్నట్లు బాగా చేయాలంటే మనమే ప్రొడ్యూస్ చేయాలని నాన్న ముందుకొచ్చారు. నాన్న ఈ సినిమాలో ఓ చిన్న రోల్ చేశారు. ఆ టైమ్ కు ఆర్టిస్ట్ అందుబాటులో లేకుంటే నేనే చేస్తా అని నాన్న అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ మహత్ నన్ను స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేశాడు. ఫైట్స్, డ్యాన్స్, లవ్, ఎమోషన్, రొమాంటిక్ ఇలా..అన్ని షేడ్స్ లో నన్ను చూపించారు. ఈ సినిమా తర్వాత నేను అన్ని ఎమోషన్స్, అన్ని జానర్స్ చేయగలను అనే పేరొస్తుంది. ఆటిట్యూడ్ స్టార్ అనేది నేను పెట్టుకున్నది కాదు. “రామ్ నగర్ బన్నీ” సినిమా చూశాక నేను ఆ ట్యాగ్ కు అర్హుడిని కాదు అంటే తీసేస్తా అని అన్నారు.
- Tags
తాజావార్తలు
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!