Site icon NTV Telugu

Balayya vs Chiranjeevi: డల్లాస్‌లో చిరు, బాలయ్య ఫ్యాన్స్ మధ్య గొడవ

Balayya Chiru Fans Fight1

Balayya Chiru Fans Fight1

Fight Between Balayya and Chiranjeevi Fans In Dallas: హీరోలందరూ కలిసి మెలిసి బాగానే ఉంటున్నారు. తమతమ సినిమాల విడుదల సమయంలో.. ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటున్నారు. తమ సినిమాలతో పాటు ఇతరుల చిత్రాలూ బాగా ఆడాలని కోరుకుంటున్నారు. కలిసి షోస్ కూడా చేస్తున్నారు. కానీ.. అభిమానుల్లోనే మార్పు రావట్లేదు. హీరోలు కలిసున్నా.. ఫ్యాన్స్ మాత్రం ‘నువ్వా-నేనా’ అనే గొడవలకు దిగుతున్నారు.

Supreme Court: ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

మా హీరోనే గొప్పంటే.. లేదు మా హీరోనే తోపు అనుకుంటూ.. బాహాబాహీకి కూడా దిగుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా మరో ఉదంతం చోటు చేసుకుంది. అమెరికాలోని డల్లాస్‌లో బాలయ్య, చిరంజీవి అభిమానులు ఓ రేంజ్‌లో గొడవ పడ్డారు. బాహాబాహీకి కూడా దిగారంటే.. పరిస్థితులు ఎంత తీవ్రంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం.. తొలుత జై బాలయ్య, జై చిరంజీవా అంటూ నినాదాలతో ఈ గొడవ మొదలైంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అయితే.. ఈసారి సంక్రాంతి పోటీలో వీరసింహారెడ్డినే విజయం సాధిస్తుందని, వాల్తేరు వీరయ్య ఫ్లాప్ అవుతుందని వ్యాఖ్యానించారు.

Ban on Public Meetings and Rallies: రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం.. సీఎం జగన్‌ అసలు టార్గెట్‌ అదేనా..?

అంతటితో ఆగకుండా.. టీడీపీ మద్దతు లేనిదే పవన్ రాజకీయాల్లోకి రాణించలేడని, అందుకే ఇప్పుడు ఎన్నికల సమయంలో మరోసారి పవన్ టీడీపీ పంచన చేరుతున్నాడంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలతో మెగాఫ్యాన్స్ హర్ట్ అవ్వడంతో, కౌంటర్ ఎటాక్‌కి దిగారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, బాహాబాహీకి దిగడం జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న డల్లాస్ పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, ఈ గొడవకి కారణమైన కేసీ చేకూరిని అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే అనుకుంటే.. చివరికి అమెరికాలోనూ ఫ్యాన్ వార్స్ మొదలుపెట్టి, తెలుగోళ్ల పరువుని గంగలో కలుపుతున్నారు.

Delhi Road Accident: ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్.. స్కూటీపై మరో యువతి కూడా..

Exit mobile version