Bheemla Nayak వెండితెరపైనే కాదు ఓటిటిలోనూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన Bheemla Nayak ఖాతాలో ఇప్పుడు మరో సరికొత్త రికార్డు పడింది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ “భీమ్లా నాయక్” చిత్రం ఇటీవలే ఆహా వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అయ్యింది. 4కేతో పాటు డాల్బీ 5.1 సౌండ్ క్వాలిటీతో ఓటిటిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే సినిమాను థియేటర్లో వీక్షించిన మెగా అభిమానులు మళ్ళీ మళ్ళీ సినిమాను వీక్షిస్తే, థియేటర్లో మిస్సైన వాళ్ళు కూడా ఓ కన్నేశారు.
Read Also : Director Shankar : హ్యాట్సాఫ్ ‘మహారాజ’మౌళి
మొత్తానికి ఫాస్టెస్ట్ మినిట్స్ అంటూ టీమ్ ఆహా నుండి వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం… ఆహాలో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను అత్యంత వేగంగా రికార్డ్ చేశాడు “భీమ్లా నాయక్”. పాపులర్ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ఇది కొత్త రికార్డు అని చెప్పాలి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓటిటి ప్రీమియర్లకు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. “భీమ్లా నాయక్” చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
