Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలికి రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ అవుతుంటే.. ఆయన వారసుడు జాసన్ సంజయ్ మాత్రం మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే, ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా తాజాగా తన డైరెక్టర్ జాసన్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా.. ‘సిగ్మా’ ఈవెంట్లో జాసన్ సంజయ్ స్టేజ్ ప్రెజెన్స్ చూసి తాను అవాక్కయ్యానని చెప్పుకొచ్చింది. తండ్రికి తగ్గ తనయుడిగా అతడిలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటూ ఆమె చేసిన కామెంట్స్ విజయ్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
“ఆడియో లాంచ్ వేదికపై ఆయన ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించారు. నేరుగా పోడియం అడిగి మరీ ఆయన మాట్లాడిన తీరు, ఆ వాగ్ధాటి చూస్తే నాకు నిజంగా షాక్ అనిపించింది. ఆయన స్పీచ్ వింటుంటే.. భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి వెళ్తాడేమో, లేదా ఫ్యూచర్ సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉందేమో అనిపించింది” అంటూ ఫరియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తండ్రి విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీతో సీఎం కుర్చీ లక్ష్యంగా అడుగులు వేస్తుంటే, ఇప్పుడు కొడుకులోనూ ఫరియాకు అలాంటి పొలిటీషియన్ లక్షణాలు కనిపించడం సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి సూపర్ స్టార్ అయినప్పటికీ ఆ ఇమేజ్ చట్రంలో జాసన్ ఇరుక్కుపోలేదని ఫరియా స్పష్టం చేసింది. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్‌ను అతను హ్యాండిల్ చేస్తున్న విధానంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. “షూటింగ్ సెట్‌ను జాసన్ ఎంత కూల్ గా, ఎంత ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేస్తాడో చూస్తే నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అతని పనితీరు, విజన్ చూశాక.. కేవలం ‘విజయ్ గారి అబ్బాయి’ అనే స్టార్ కిడ్ ఇమేజ్ను జనాలు కొద్దిసేపటికే మర్చిపోతారు. తన టాలెంట్ తో డైరెక్టర్‌గా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాడు” అని ఫరియా తన దర్శకుడిపై అపారమైన నమ్మకం వ్యక్తం చేసింది.
Also Read
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
తాజావార్తలు
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!