Site icon NTV Telugu

Don 3: వా.. మాకు షారుఖ్ మాత్రమే కావాలయ్యా..

Don

Don

Don 3: డాన్ అనగానే టక్కున అమితాబ్ గుర్తొచ్చేస్తాడు. ఆ తరువాత డాన్ అనగానే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తొస్తాడు.షారుక్ ఖాన్-ప‌ర్హాన్ అక్త‌ర్ కాంబోలో వచ్చిన డాన్ సినిమా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది. అందులో షారుఖ్ నటన, స్టైల్, స్వాగ్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఎప్పటికైనా డాన్ ప్రాంచైజీ కొనసాగితే అది కేవలం షారుఖ్ మాత్రమే చేయాలి. ఇది బాలీవుడ్ అభిమానులు ఎప్పుడో రాసుకున్న రాత. దాన్ని మార్చడం ఎవరి వలన కాదు. కొన్ని టైటిల్స్ కు హీరోలకు అలా సెట్ అయిపోతాయి అంతే. డాన్ అంటే షారుఖ్ మాత్రమే అని అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే.. ప‌ర్హాన్ అక్త‌ర్ డాన్ ప్రాంచైజీ లో మరో కొత్త చాప్టర్ ను ఓపెన్ చేయనున్నాడు. అవును ఆయన అధికారికంగా డాన్ 3 ను ప్రకటించాడు. అయితే ఈసారి షారుఖ్ ఖాన్ మాత్రం డాన్ గా నటించడం లేదని కూడా తెలిపాడు.

Jabardasth Rohini: వీల్ చైర్ లో వచ్చి యాంకరింగ్ చేసిన రోహిణి..

ఇక ఈ డాన్ 3 తో డాన్ ప్రాంచైజీ ముగుస్తుందని కూడా తెలిపాడు. దీంతో బాలీవుడ్ మండిపడుతుంది. ముఖ్యంగా షారుఖ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. షారుఖ్ అంటే డాన్.. డాన్ అంటే షారుఖ్.. ఆయన ప్లేస్ లో ఇంకే హీరో ఉన్నా కూడా డాన్ 3 ను చూడబోయేది లేదని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాగా.. ఈసారి డాన్ ప్లేస్ ను రీప్లేస్ చేసేది రణవీర్ సింగ్ అంటూ మాటలు వినిపిస్తున్నాయి. దీంతో మరింతగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత.. ? ఫ్యాన్స్ కోరికను మన్నించి మేకర్స్ షారుఖ్ ను ఒప్పిస్తారా.. ? లేక రణవీర్ తోనే సినిమాను పూర్తిచేస్తారా.. ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Exit mobile version