ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ , ‘డుంబు’ సృష్టికర్త బుజ్జాయి ఇక లేరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రసిద్ధ రచయత దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, ప్రముఖ చిత్రకారుడు సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) చెన్నయ్ లో గురువారం రాత్రి కన్నుమూశారు. సెప్టెంబరు 11, 1931లో జన్మించిన ఆయన తండ్రి చేయి పట్టుకుని సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు తప్పితే ఏ రోజునా పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసించింది లేదు. సాంప్రదాయక చదువులు చదవకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ఆయన తండ్రి వెన్నంటే ఉండేవారు. అలా ఉండడం వలన ఆ కాలం నాటి గొప్ప వ్యక్తులందరికి సన్నిహితంగా మెలిగారు.
Read Also : 100 సార్లు పడిపోయా… వదిలేయాలని అనుకున్నా… కానీ… : సమంత
Also Read
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్‌పై కేసు నమోదు!
- Lenin : అఖిల్‌కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
- Prabhas : 'ఫౌజీ' బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
17 సంవత్సరాల వయసులో బుజ్జాయి పేరుతో ‘బానిస పిల్ల’ అన్న బొమ్మల పుస్తకం ప్రచురించి ‘కామిక్ స్ట్రిప్’ పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్త ఈయనే. పంచతంత్ర కథలకు ముచ్చటైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. లక్షలమందిని ఆకట్టుకున్నారు. ఈ ఇంగ్లిష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ దొరుకుతున్నాయి. ‘న్యాయానికి భయం లేదు’ అనే బొమ్మల ధారావాహిక ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైనది. ఇది 1975లో వచ్చింది. పలు భారతీయ భాషల్లో 42కు పైగా బొమ్మల కథలు వివిధ పత్రికలలో సంవత్సరాల పాటు సీరియల్ గా వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో 15 కార్టూన్ కథల పుస్తకాలను వెలువరించారు. ఆంగ్లంలోనూ సీజన్స్ పబ్లికేషన్స్, దేవమాల ప్రచురణ సంస్థలు ఆయన బొమ్మల కథలను పుస్తకాలుగా తీసుకొచ్చాయి. శ్రీ బుజ్జాయి 2010లో ‘నాన్న-నేను’ అనే స్వీయచరిత్ర పుస్తకాన్ని వ్రాసారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన తన కుమారునికి తన తండ్రి పేరు ‘దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి’ అని పెట్టుకున్నారు. కుమారుడు కూడా రచయిత. బుజ్జాయి కుమార్తె రేఖా సుప్రియ సీనియర్ సినీనటుడు నరేష్ మాజీ భార్య. ఆమె కుమారుడు తేజ. బుజ్జాయి రెండవ కుమార్తె లలిత రామ్ కూడా తెలుగు రచయిత్రి.



తాజావార్తలు
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
-
Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!