NTV Telugu Site icon

Mega Princess: మెగా ప్రిన్సెస్ జాతకం చెప్పిన వేణుస్వామి.. మెగా కుటుంబంలో వారు ఉండరట

Charan

Charan

Mega Princess: ఎట్టకేలకు మెగా కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ వచ్చేసింది. దాదాపు పదకొండు ఏళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. మంగళవారం నాడు.. మెగా వారసురాలు ఇంట అడుగుపెట్టింది. లక్ష్మీ దేవిలా మెగా కుటుంబానికి సందడి తెచ్చింది. ఆమె రాకతో మెగా కుటుంబమే కాదు మెగా ఫ్యాన్స్ సైతం సంతోషంతో సంబురాలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా మెగా ప్రిన్సెస్ జాతకం పై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంత- నాగ చైతన్య విడాకుల విషయంలో అతడు చెప్పింది నిజం కావడంతో అప్పటినుంచి అతడు ఏ సెలబ్రిటీ జాతకం చెప్పినా నిజం అవుతుందని చాలామంది అభిమానులు నమ్ముతున్నారు. ఇక మెగా ప్రిన్సెస్ జాతకం ఎంతో అద్భుతంగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.

Minister Roja: మెగా ప్రిన్సెస్ జననం.. ఆ హత్తుకోవడం ఇంకా మరువలేదంటూ రోజా ఎమోషనల్!

” ఈ పాప జన్మించడం వలన మెగా కుటుంబంలో అందరికి కలిసివస్తుంది. చాలా అద్భుతమైన జాతకం ఆమెది. గురుచండాల యోగంలో జన్మించింది. గురువు బృహస్పతి రాహువుతో కలిసి ఒకే రాశిలో ఉంటే దాన్ని గురుచండాల యోగం అంటారు. ఆ యోగంలో జన్మించడం వలన ఈమె నిజంగానే లక్ష్మీ దేవిని ఇంటికి తీసుకువస్తుంది. కాకపోతే ఈమె జాతకంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక ముందు ముందు రామ్ చరణ్- ఉపాసన దంపతులకు మరో సంతానం ఉండకపోవచ్చు. గురు చండాల యోగం ఉంది. శని గురువు చూస్తూ ఉండడం వలన.. సింగిల్ చైల్డ్ గానే ఆమె జాతకం కనిపిస్తుంది. అంటే ఒకే ఒక్క అమ్మాయి ఈ ఇంట్లో ఉండే అవకాశం ఉంది. ఇక చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించి మెగా సంతానం వాళ్ళింట్లో ఉండకపోవచ్చు. రామ్ చరణ్ కు మగసంతానం ఇకమీద ఉండకపోవచ్చును. ఇక లక్ష్మీ దేవి లాంటి అమ్మాయి చిరంజీవి కుటుంబంలో జన్మించింది. అందుకు వారికి శుబాకాంక్షలు తెలుపుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.