Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
- ‘జై ఎన్టీఆర్’ నినాదంతో ఫ్యాన్స్‌లో జోష్
- తారక్‌తో రాత్రి 3 గంటల వరకు ముచ్చట్లు
- తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న ఫహాద్
- తెలుగు సినిమాకు తన లవ్ లెటర్ అన్న ఫాఫా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో మలయాళ వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ (ఫాఫా) తన ప్రసంగంతో వేదికపై సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. మైక్ అందుకోగానే స్వయంగా “జై ఎన్టీఆర్” అంటూ నినదించి నందమూరి అభిమానులను కేరింతలతో ముంచెత్తారు. ఇక్కడ ఇంత మంది ప్రేక్షకులు, అభిమానులు సమకూరడానికి ఏకైక కారణం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని ఫహాద్ కొనియాడారు. వేదికపై ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని, తెలుగు సినిమాపై తనకున్న ప్రేమను పంచుకుంటూ సభను మంత్రముగ్ధులను చేశారు.
తారక్‌తో రాత్రి 3 గంటల వరకు ముచ్చట్లు..
ఈ సినిమా షూటింగ్ నిమిత్తం తాను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి తారక్ తన గురించి ఎంతో కేర్ తీసుకున్నారని ఫహాద్ ఫాజిల్ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ ఇంట్లో గడిపిన ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకమైనదని, రాత్రి 3 గంటలైనా సరే ఇద్దరూ కూర్చుని పెట్టుకున్న ముచ్చట్లు తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని తీపి జ్ఞాపకాలని చెప్పారు. ఈ సినిమా షూటింగ్, ఇతర ప్రాజెక్టుల కారణంగా గత కొన్నేళ్లుగా తన భార్యకు దూరంగా ఉండాల్సి వస్తోందని, అయినప్పటికీ హైదరాబాద్‌లో తారక్ అందించిన ఆప్యాయత ఆ లోటు తెలియకుండా చేసిందని తెలిపారు.
Also Read
సొంతంగా డబ్బింగ్.. తెలుగు సినిమాకు ఈ చిత్రం నా ‘లవ్ లెటర్’
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంలో తన పాత్రకు తానే స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నట్లు ఫహాద్ వెల్లడించారు. తెలుగు చిత్రసీమ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తపరుస్తూ.. ‘స్వాతిముత్యం’, ‘అంతఃపురం’ సినిమాలు తనకు అత్యంత ఇష్టమైన తెలుగు చిత్రాలని తెలిపారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు, తెలుగు పరిశ్రమకు తాను రాసిన ఒక ‘లవ్ లెటర్’ లాంటిదిగా ఫహాద్ అభివర్ణించారు. అక్టోబర్ 2న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!