విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. అనిల్ రవిడిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సినిమా ఎఫ్ 2 కు సీక్వెల్ గా రాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మే 27 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. ఇక వెంకీ మామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ ఉంటే ఫన్ అక్కడ ఉంటుంది. ఇక తాజాగా ఈ చిత్ర బృందం బిత్తిరి సత్తి తో చేసిన ఇంటర్వ్యూ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. అనిల్ రావిపూడిని బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు.
ఆయన ప్రశ్నలకు వెంకటేశ్ స్పందిస్తూ .. “ఈ సినిమాలో నాకు రేచీకటి ఉంటుంది. ఆ సమయంలో నేను ఇచ్చే సలహాలు వినడం వలన వరుణ్ ఇబ్బందులు పడుతుంటాడు. ఇక్కడే కావలసినంత కామెడీ పండుతుంది. అంటూ చెప్పుకు వస్తాడు. అంతలోనే సత్తి మీ నాన్న ఫాఫాలు చేసాడు.. అందుకే మీకు రేచీకటి వచ్చిందనుకుంటా అంటూ కొన్ని మాటలు పలకడం రాని సత్తి వచ్చి రానట్లు మాట్లాడాడు. ఇక దీంతో వెంకటేష్ కూడా సత్తిని ఇమిటేట్ చేస్తూ మా నాన్న ఎన్నో ఫాఫాలు చేశాడు.. అందుకే నాకు రేచీకటి వచ్చింది.. అరుణ్ తేజ్ ను అందుకే ఇబ్బంది పెట్టాను అంటూ సత్తిని ఇమిటేట్ చేసి మాట్లాడాడు. ఇలా వెంకీ మామ పంచులతో ఇంటర్వ్యూ అంతా నవ్వులు పూయిస్తుందే ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ ఫన్ టాస్టిక్ ఇంటర్వ్యూ పై ఓ లుక్కేయండి.